‘వీరమల్లు’, ‘కాంతారా 1’ కాంట్రవర్సీపై పవన్ కామెంట్స్ వైరల్!

‘వీరమల్లు’, ‘కాంతారా 1’ కాంట్రవర్సీపై పవన్ కామెంట్స్ వైరల్!

Published on Mar 16, 2026 5:25 PM IST

veeraallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి తాజాగా రాబోతున్న చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమాకి ముందు పవన్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ విడుదల సమయంలోనే వారం గ్యాప్ లో కన్నడ భారీ సినిమా కాంతార చాప్టర్ 1 కూడా వచ్చింది.

అయితే ఆ సమయంలో కాంతారా చాప్టర్ 1 ని బాయ్ కాట్ చెయ్యాలి అంటూ సోషల్ మీడియాలో తెలుగు ఆడియెన్స్ అలాగే పవన్ అభిమానులు కూడా ట్రెండ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమాకి ఏపీలో హైక్స్ దక్కాయి. అయితే కాంతార 1 ని బాయ్ చేయడానికి పిలుపు రావడానికి కారణం పవన్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా తాలూకా పోస్టర్ కాంట్రవర్సీ. క

న్నడలో విడుదల చేస్తున్న నేపథ్యంలో కన్నడ పోస్టర్స్ వేయలేదని కర్ణాటకలో వీరమల్లు సినిమా పోస్టర్స్ ని వారు చించివేసి నానా రభస చేశారు. అయినప్పటికీ కాంతార 1 కి హైక్స్ ఇచ్చారు. దీనిపైనే లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో కూడా పవన్ మాట్లాడ్డం జరిగింది. తాను ఏ సినిమాని భాష పరంగా చూడనని భారతీయ సినిమాగానే చూస్తానని. అందుకే తన సినిమాకి అక్కడ ఇబ్బందులు కలిగించినా కాంతార 1 కి మన దగ్గర హైక్స్ ఇవ్వడం జరిగింది అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు