నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నయనతార హీరోయిన్ గా చేస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని మొదట ఓ కథతో అనుకున్నప్పటికీ తర్వాత మార్చి బాలయ్య కోసం మరో బలమైన సబ్జెక్టుని దర్శకుడు గోపీచంద్ సిద్ధం చేశారు.
ఇక ఈ సినిమాలో ప్రముఖ వెర్సటైల్ నటుడు సముద్రఖని నటిస్తున్నట్టు ఖరారు చేశారు. ఇది వరకే క్రాక్ సినిమాలో కటారి కృష్ణగా మాస్ విలన్ రోల్ ని తాను చేయగా మళ్ళీ గోపీచంద్ మలినేని అదే తరహా పవర్ఫుల్ రోల్ ని బాలయ్య సినిమాలో అందించినట్టు తాను తెలిపారు. మరి వీరి కలయికలో సీన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే మరి. ఇక ఈ చిత్రాన్ని పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.


