బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తనలో మంచి నటి మాత్రమే కాదు, ఓ మంచి నిర్మాత కూడా ఉంది అంటుంది. నిర్మాతగా తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఆల్ రెడీ, ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై `డార్లింగ్స్`, `జిగ్రా` వంటి వైవిధ్యమైన సినిమాలను ఆమె నిర్మించారు. కాగా తాజాగా తన 33వ పుట్టినరోజును పురస్కరించుకుని `ఎటర్నల్ కిడ్స్` అనే మరో కొత్త నిర్మాణ సంస్థని అలియా భట్ ప్రారంభించింది. తన మాతృ సంస్థకు ఇదొక చిన్నారి లాంటిదని, పిల్లల కోసం అద్భుతమైన కథలను అందించడమే తన టార్గెట్ అని అలియా భట్ చెప్పుకొచ్చింది.
తన కొత్త సంస్థ గురించి అలియా భట్ మాట్లాడుతూ.. `మా చిన్నప్పుడు మేము పెరిగిన కథలను మళ్ళీ సజీవం చేయబోతున్నాం` అంటూ అలియా భట్ ఎమోషనల్ అయింది. పైగా ఈ కొత్త బ్యానర్‌లో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కడం విశేషం. సీ, జీ, ఎం అనే సినిమాలను నిర్మిస్తుంది. మొత్తానికి తల్లిగా మారిన తర్వాత పిల్లల కంటెంట్ పట్ల అలియా భట్ కు ఆసక్తి పెరిగింది. మరి తన కూతురు రాహా వంటి చిన్నారులను అలరించడానికి అలియా ఇంకా ఎన్ని చిత్రాలు చేస్తోందో చూడాలి.


