హల్దీ + హోలీ : ఉదయ్ పూర్ హల్దీ వేడుకలో విజయ్-రష్మికల అల్లరి చూశారా? క్యూట్ ఫొటోలు వైరల్!

హల్దీ + హోలీ : ఉదయ్ పూర్ హల్దీ వేడుకలో విజయ్-రష్మికల అల్లరి చూశారా? క్యూట్ ఫొటోలు వైరల్!

Published on Mar 16, 2026 7:48 PM IST

vijy rs

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ డెస్టినేషన్ వెడ్డింగ్ మెమొరీస్ ను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. తాజాగా ఉదయ్ పూర్ లో జరిగిన తమ హల్దీ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫొటోలను చూస్తుంటే.. వీరు పసుపు పూసుకోవడం కంటే, రంగులు నీళ్లతో రచ్చ చేసి హోలీ ఆడుకున్నట్లే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వేడుకకు సంబంధించి విజయ్, రష్మిక ఇద్దరూ తమ సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హల్దీ కాదు.. హోలీ పండుగ!

సాధారణంగా పెళ్లింట్లో హల్దీ వేడుక అనగానే పసుపు రాసి మురిసిపోతారు. కానీ మన రౌడీ హీరోకి మాత్రం అదొక రేంజ్ లో జరగాలని ముందే ఫిక్స్ అయ్యాడట. ఈ అల్లరిలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంతలా రెచ్చిపోయారంటే.. ఏకంగా తను ఇష్టపడి డిజైన్ చేయించుకున్న కుర్తా కూడా పాడైపోయిందని విజయ్ చెప్పుకొచ్చాడు. ముందు రోజు రాత్రంతా సంగీత్ లో ఎంజాయ్ చేసి ఉదయం నిద్రలేవకపోయినా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేయాలనే ఉత్సాహంతోనే హల్దీకి రెడీ అయ్యామన్నాడు.

ఇక ఈ హడావిడిని రష్మిక కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇది హల్దీ వేడుకలా లేదని, ‘హల్దీ + హోలీ’లా జరిగిందని తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. రంగులు, నీళ్లతో ఎంతలా తడిసిపోయామంటే.. తన జుట్టులో ఇంకా ఎరుపు రంగు పోలేదని సరదాగా కామెంట్ చేసింది.

రౌడీ హీరో కూడా రష్మిక టీమే!

ఈ వేడుకలో జరిగిన ఆటల గురించి రష్మిక ఒక క్యూట్ సీక్రెట్ ను బయటపెట్టింది. హల్దీలో ‘టీమ్ బ్రైడ్’ దే గెలుపు అని మురిసిపోయిన ఈ బ్యూటీ.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే, విజయ్ (విజ్జు) కూడా తన టీమ్ లోనే ఉండిపోయాడు అంటూ అసలు విషయం చెప్పేసింది.

ఇండియాలోనే జరగాలని..

తన పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా సరే, అది మన దేశంలోనే జరగాలని ఎప్పటినుంచో అనుకున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చాడు. తనకు ప్రకృతి అంటే ఇష్టమని, అందుకే నదులు, కొండలు, పచ్చదనం మధ్య ఉండే ఉదయ్ పూర్ లోని 200 ఎకరాల రిసార్ట్ ను ఎంచుకున్నట్లు తెలిపాడు. అక్కడి వాతావరణం, సర్వీస్, ఫుడ్ అద్భుతంగా ఉన్నాయని ఈ జంట ప్రశంసలు కురిపించింది. తమ డ్రెస్సులను డిజైన్ చేసిన అనామికా ఖన్నాకు ఇద్దరూ స్పెషల్ థాంక్స్ చెప్పారు. “ఇది మా ప్రయాణానికి ఒక అందమైన మొదలు మాత్రమే” అంటూ రష్మిక ఎమోషనల్ గా తన పోస్ట్ ను ముగించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు