పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఐతే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ రాశీ ఖన్నా, థమన్ గురించి చెప్పడం మర్చిపోయానంటూ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్ లో నేను ఇద్దరి పేర్లు మర్చిపోయాను. పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తుండటంతో వారి పేర్లు చెప్పడం మర్చిపోయాను. రాశీ ఖన్నా స్క్రిప్ట్ కూడా వినకుండా డైరెక్ట్ సెట్స్ లోకి వచ్చింది. ఫస్టాఫ్ లో ఆమె సినిమాకి బిగ్గెస్ట్ అస్సెట్. థ్యాంక్యూ రాశీ” అని హరీష్ శంకర్ తెలిపారు.
హరీష్ శంకర్ ఇంకా మాట్లాడుతూ.. ‘అలాగే, మా బావ థమన్ గురించి కూడా చెప్పాలి. తనే మొత్తం బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాడు. ‘బావా.. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు పెడుతున్న కష్టం, ఇచ్చిన టైంకి థ్యాంక్స్ సరిపోదు. రెండు చేతులెత్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’. థమన్ దగ్గరకి సినిమా వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయింది’ అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.


