ఇప్పుడు రాబోతున్న బాలీవుడ్ సంచలన సీక్వెల్ చిత్రమే ధురంధర్ పార్ట్ 2. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్ తో మొదలు కానుంది. అయితే ఈ సినిమా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక రికార్డ్ ఓపెనింగ్స్ ని ఇప్పుడు ఖాయం చేసుకుంది. ఆల్రెడీ ఇండియా వైడ్ గా రికార్డ్ ప్రీమియర్ నెంబర్ నమోదు అయింది.
40 కోట్లకి పైగా గ్రాస్ కేవలం ఇవాళ్టి ప్రీమియర్స్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ చూసుకుంటే ఈజీగా 150 నుంచి 180 కోట్ల వరకు ట్రెండ్ కనిపిస్తుంది. ఇది 200 వరకు వెళ్లినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ధురంధర్ 2 తో మాత్రం ఒక నెవర్ బిఫోర్ ఓపెనింగ్ ఇప్పుడు చూడబోతున్నాం అని చెప్పవచ్చు.


