‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్: ఉగాది కానుకగా శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్: ఉగాది కానుకగా శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

Published on Mar 19, 2026 7:00 AM IST

Untitled 27 1

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ నటిస్తున్న ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివరాజ్ కుమార్ ఆహార్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. భుజంపై కండువా, బిగించిన పిడికిలితో ఆయన చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోస్తున్న తీరు భారతీయ సినీ ప్రేమికుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ దక్షిణాది ఇండస్ట్రీలో అంచనాలను పెంచగా, తాజా పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సిద్దగాని సాయి కిరణ్ గౌడ్, చింతకింది రూప కాస్ట్యూమ్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.

తాజా వార్తలు