పెళ్లి వార్తలపై అనుష్క శెట్టి టీమ్ ఫైర్..!

పెళ్లి వార్తలపై అనుష్క శెట్టి టీమ్ ఫైర్..!

Published on Mar 19, 2026 9:01 PM IST

Anushka-Shetty

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘స్వీటీ’ అనుష్క శెట్టి వివాహం గురించి రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తా సంస్థలు వరుస కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ ప్రచారంపై అనుష్క టీమ్ తాజాగా స్పందిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మీడియా విభాగాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోజువారీ హెడ్‌లైన్స్‌గా మార్చే ముందు కనీసం అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని హితవు పలికింది.

​ముఖ్యంగా ఈ వార్తల్లో అనుష్క వయస్సును పదే పదే హైలైట్ చేయడాన్ని ఆమె టీమ్ తప్పుబట్టింది. “వార్తలు రాసేటప్పుడు వయస్సును ఎందుకు వివాదాస్పదంగా మారుస్తున్నారు? ఇది పరోక్షంగా ఒక వ్యక్తిని కించపరచడమే. ఇదే ఉత్సాహం మగ నటుల విషయంలో ఎందుకు కనిపించదు? కేవలం మహిళా నటుల విషయంలోనే ఇలాంటి వివక్ష ఎందుకు?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. నిజా నిజాలు నిర్ధారించుకోకుండా కేవలం వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం జర్నలిజం అనిపించుకోదని స్పష్టం చేసింది.

​అనుష్క శెట్టి ఎప్పుడూ పీఆర్ స్టంట్లు లేదా అనవసర పబ్లిసిటీపై ఆధారపడకుండా, తన ప్రతిభతో మరియు హుందాతనంతో కెరీర్‌ను నిర్మించుకున్నారని ఆమె టీమ్ గుర్తు చేసింది. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని భావిస్తారని, ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరింది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, దాన్ని కేవలం ఒక ‘ట్రెండ్’లా చూడటం మానేసి, నటీమణులకు కూడా సరైన గౌరవం ఇవ్వాలని గట్టిగా కోరింది.

తాజా వార్తలు