హరీష్ అండ్ టీమ్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు..!

హరీష్ అండ్ టీమ్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు..!

Published on Mar 19, 2026 9:53 PM IST

ustaad 4

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల మరియు రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. పవన్ కళ్యాణ్ మార్క్ మ్యానరిజమ్స్ మరియు హరీష్ శంకర్ మార్క్ డైలాగులతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

​సినిమాకు వస్తున్న స్పందన పట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌లను కలిసి అభినందనలు తెలిపారు. చిత్ర బృందంతో ఆయన సరదాగా గడిపిన ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

​ఈ చిత్రంలో ఆర్. పార్థిబన్ విలన్‌గా కీలక పాత్ర పోషించగా, దేవి శ్రీ ప్రసాద్ పాటలను, ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన సినిమా టీమ్‌ను ప్రత్యేకంగా కలవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

తాజా వార్తలు