ఇండియన్ సినిమా దగ్గర వచ్చినటువంటి ఒక ఫైనెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ చిత్రం దృశ్యం కూడా ఒకటి. ఈ సినిమా హిట్ అయ్యి ఇప్పుడు మూడో భాగం వరకు కూడా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యిన ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ కాగా దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పుడు ఫైనల్ సినిమాని తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ మొదట మలయాళం లోనే విడుదల చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు.
నిజానికి ఈ ఏప్రిల్ 2న గ్రాండ్ రిలీజ్ కి లాక్ చేశారు కానీ ఇప్పుడు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మలయాళ సినిమాలకి ముఖ్యంగా మోహన్ లాల్ కి గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. కానీ ఇప్పుడు ఆ దేశాల్లోనే నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో సినిమాని మేకర్స్ వాయిదా వేసినట్టు గట్టి టాక్ వినిపిస్తోంది. సో ఈ క్రేజీ థ్రిల్లర్ రానట్టే అనుకోవాలి. అలాగే మేకర్స్ ఏమన్నా దీనిపై అధికారిక క్లారిటీ అందిస్తారో లేదో చూడాలి..


