మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న మల్టీ స్పోర్ట్స్ చిత్రమే పెద్ది. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే స్టేజి లో ఉంది. అయితే ప్రస్తుతం మేకర్స్ సాలిడ్ క్లైమాక్స్ ముగింపులో ఉన్నట్టుగా టాక్.
ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుండగా ఈ తర్వాత పాటల చిత్రీకరణ మొదలు పెట్టానున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఇవి రెండు పూర్తి చేయాల్సి ఉందట. ఇవి కూడా ఆన్ టైం పూర్తి చేసి సినిమాని గ్రాండ్ గా ఏప్రిల్ 30 నే తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


