పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా అభిమానులుని మాస్ ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే ఈ సినిమాలో కేవలం దేవిశ్రీప్రసాద్ పాటలు, థమన్ నేపథ్య సంగీతం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అలానే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటల్లో ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే పాటని మొత్తానికి థియేటర్స్ లో తీసేసారు అనుకుంటే రిలీజ్ రోజున మాత్రం ఎండ్ క్రెడిట్స్ లో కేవలం మ్యూజిక్ బీట్స్ వేశారు. కానీ ఇప్పుడు డే 2 లో మరో వెర్షన్ వినిపించింది. ఈసారి పూర్తిగా ఆ సాంగ్ ని తీసేసి థమన్ వెర్షన్ సాంగ్ ని ఎండ్ క్రెడిట్స్ లో వేశారు. మరి ఈ ఆకస్మిక మార్పులు, చేర్పులు ఎందుకు అనేది మేకర్స్ కి తెలియాలి. ఇంట్రెస్టింగ్ గా థమన్ ఇచ్చిన సాంగ్ కూడా ఇందులో బాగుంది.


