బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఇంటెన్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “ధురంధర్”. ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. అయితే ఈ సినిమా ఇతర సీక్వెల్స్ లా కాకుండా అతి తక్కువ బడ్జెట్ లోనే పూర్తయిపోయినట్టు టాక్ వినిపిస్తుంది.
మేకర్స్ కేవలం 250 కోట్ల లోనే పార్ట్ 2 ని మంచి క్వాలిటీతో తెరకెక్కించినట్టుగా టాక్. అయితే ఇంత తక్కువలోనే ఎలా అంటే సినిమా తారాగణంలో చాలా సేవ్ అయ్యిందని తెలుస్తుంది. రణ్వీర్ సింగ్ ఈ సినిమాకి కేవలం 50 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేసాడట. తనే కాకుండా ఇతర నటీనటులు కూడా ఇదే రీతిలో తీసుకున్నారని తెలుస్తుంది.
సో అంత క్వాలిటీతో కూడిన సాలిడ్ ప్రాజెక్ట్ ని ఆదిత్య ధర్ ఎక్కడా లిమిట్ దాటకుండా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. అలాగే ఓ రకంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన ఎన్నో భారీ సీక్వెల్స్ తో పోలిస్తే ఇదే తక్కువ కాస్ట్ లో పూర్తయ్యిన సీక్వెల్ అని కూడా అనుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ బీ62 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.


