రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. కాగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం రవి కిరణ్ కోలా ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ను ముంబైలో ఘాట్ చేయనున్నారు. ముంబై స్లమ్ ఏరియా చుట్టూ ఈ ఎపిసోడ్ నడుస్తోందట. గతంలో జరిగిన షెడ్యూల్ లో ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని సీన్స్ ను ఘాట్ చేశారు.
కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


