పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద స్టడీగా తన సత్తా చాటుతోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్లలో మాస్ జాతర నడుస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్ నిన్న ఫ్యాన్స్‌కు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌తో తన కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతోందని స్పష్టం చేసి అంచనాలను అమాంతం పెంచేశారు.
బుక్ మై షోలో సరికొత్త మైలురాయి
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూడో రోజు (డే 3) బుక్ మై షో (BookMyShow) ఆన్లైన్ టికెట్ సేల్స్‌కు సంబంధించిన డేటా బయటకు వచ్చింది. మూడో రోజు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఏకంగా 1 లక్షా 35 వేలకు పైగా (135.75K) టికెట్లు అమ్ముడయ్యాయి. రెండో రోజుతో పోలిస్తే ఈ లెక్క కాస్త తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా చూస్తే మాత్రం బుక్ మై షోలో ఈ చిత్రం సరికొత్త మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 1 మిలియన్ (10 లక్షల) టికెట్ల సేల్స్ మార్క్‌ను క్రాస్ చేసి పవన్ స్టామినాను మరోసారి నిరూపించింది.
ఆదివారం వసూళ్లే కీలకం
ఇక ఈ సినిమాకు ఆదివారం నాటి కలెక్షన్స్ అత్యంత కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2’ సినిమా కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం బుకింగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి వారం టోటల్ కలెక్షన్స్‌ను డిసైడ్ చేయనున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్, రావు రమేష్, సీనియర్ నటి గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు.


