బాలీవుడ్ లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ధురంధర్ పార్ట్ 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ సెన్సేషనల్ గా మారింది. టాలెంటెడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద మొత్తం మూడు రోజుల రన్ ని పూర్తి చేసుకుంది.
మరి ఈ మూడు రోజుల్లో హిస్టారికల్ రన్ ని బాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర సెట్ చేసింది. కేవలం ఈ 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 500 కోట్ల గ్లోబల్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టు ఖరారు అయ్యింది. దీనితో ధురంధర్ మేనియా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ తదితరులు నటించగా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.


