పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మ్యూజికల్ హిట్స్ గా ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. అయితే ఈ హిట్ చిత్రాల్లో దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రం తొలిప్రేమ సినిమాలో ఈ మనస్సే సాంగ్ ఇప్పుడుకీ అంతా వైబ్ అవుతున్నారు. ఉస్తాద్ థియేటర్స్ లో అభిమానులు అంతా ఈ సాంగ్ తో అంతా మైమరిచిపోతున్నారు.
ఇక మ్యాజిక్ ని ఆ సాంగ్ ఒరిజినల్ సినిమా దర్శకుడు కరుణాకరన్ కూడా ఎక్స్ పీరియన్స్ చేస్తున్న వీడియో విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఇది సోషల్ మీడియాలో అభిమానులు నడుమ వైరల్ గా మారింది. ప్రస్తుతం కరుణాకరన్ నుంచి ఎలాంటి సినిమాలు చేస్తున్న బజ్ లేదు. తన చివరి సినిమా తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమా చేసి ఇక బ్రేక్ తీసుకున్నారు. పలు క్లాసిక్ లవ్ స్టోరీస్ అందించిన తను మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Nothing beats this feeling ❤️
Still vibing to what he created years ago.#Tholiprema Director Karunakaran enjoying the Ee Manase in #UstaadBhagatSingh
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) March 22, 2026


