ధురంధర్ 2 : బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేసిన రణ్‌వీర్..!

ధురంధర్ 2 : బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేసిన రణ్‌వీర్..!

Published on Mar 23, 2026 12:20 PM IST

Dhurandhar-2-Baahubali-And-

బాలీవుడ్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ 2’(Dhurandhar 2) ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తనదైన టేకింగ్‌తో రూపొందించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సీక్వెల్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కేవలం 3 రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక 4 రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.750 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ పలు రికార్డులు బ్రేక్ చేసింది.

గతంలో బాహుబలి 2(రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్(రూ.470 కోట్లు) సాధించిన రికార్డును ‘ధురంధర్ 2’ క్రాస్ చేసింది. ఇక హయ్యెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. టాప్ ప్లేస్‌లో పుష్ప 2(రూ.762 కోట్లు) రికార్డును మాత్రం ధురంధర్ 2 టచ్ చేయలేకపోయింది. రణ్‌వీర్ సింగ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు తోడుగా అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ తదితరులు తమ నటనతో మెప్పించారు.

తాజా వార్తలు