రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. మొత్తానికి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయిని ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ రూ.750 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్ బేడీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా రాకేశ్ బేడీ మాట్లాడుతూ.. ‘ధురంధర్ 2’లో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఈ మూవీ కేవలం రికార్డులను బద్దలు కొట్టడమే కాదు, గత రికార్డులను తుడిచేస్తుంది. ఈ సందర్భంగా అందరికీ ఒక విన్నపం. సినిమా చూసే సమయంలో వీడియోలను తీసి, సోషల్ మీడియాలో పెట్టొద్దు. సినిమా చూడబోయే వారి ఉత్సుకతను దెబ్బతీస్తాయి. సినిమా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది’ అని రాకేశ్ బేడీ చెప్పుకొచ్చారు.


