అఖిల్ ‘లెనిన్’లో మరో హీరోయిన్ ?

అఖిల్ ‘లెనిన్’లో మరో హీరోయిన్ ?

Published on Mar 23, 2026 8:57 PM IST

Lenin

యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో ఓ హీరోయిన్ కనిపించనుందని టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఏ హీరోయిన్ ఈ సాంగ్ లో కనిపిస్తోందో చూడాలి.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

తాజా వార్తలు