100 కోట్ల యంగ్ హీరో సై ఫై లవ్ స్టోరీ మళ్లీ వాయిదా!?

100 కోట్ల యంగ్ హీరో సై ఫై లవ్ స్టోరీ మళ్లీ వాయిదా!?

Published on Mar 25, 2026 2:00 AM IST

Love Insurance Kompany

తన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వరుస 100 కోట్ల వసూళ్లతో రఫ్ఫాడించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నుంచి రాబోతున్న నెక్స్ట్ అవైటెడ్ సినిమానే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ సై ఫై లవ్ స్టోరీగా రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఆడియెన్స్ కి ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు.

ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 3కి లాక్ చేశారు. కానీ ఈ సినిమా అక్కడ కూడా వాయిదా పడింది అని ఇపుడు వినిపిస్తోంది. ఓ పక్క ప్రదీప్ రంగనాథన్ ఇంకా డబ్బింగ్ పూర్తి చెయ్యలేదు అనే ఓ వెర్షన్ ఇంకోపక్క వేరే ఇబ్బందులు వల్ల సినిమా 3న రావట్లేదు అన్నట్టు వినిపిస్తోంది.

అక్కడ నుంచి మరో వారం వాయిదా వేసి ఏప్రిల్ 10న మేకర్స్ ఈ సినిమాని విడుదల చేస్తారు అన్నట్టు ఇప్పుడు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే నయనతార ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు