ఇప్పుడు తెలుగు సినిమా నుంచి వస్తున్న అవైటెడ్ వరల్డ్ క్లాస్ సినిమానే వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న పలు షేడ్స్ లో శ్రీరాముని వెర్షన్ కూడా ఒకటి. దీనిని ఎంతో సర్ప్రైజ్ గా జక్కన్న తన మాటలతో రివీల్ చేసేసారు. అయితే ఈ సినిమాలో మహేష్ రాముని గెటప్ లో కనిపించడం ఖాయం అయ్యిపోయింది. అలాగే సరిగ్గా ఏడాదిలోనే ఈ సినిమా రానుంది.
ఈ నేపథ్యంలో వచ్చిన ఈ రామ నవమికే మహేష్ బాబుపై ఆ పోస్టర్ కూడా వచ్చేసి ఉంటే ఖచ్చితంగా ఈ రోజుకి మరో బిగ్గెస్ట్ ఫీస్ట్ గా తెలుగు సినిమా నుంచి ఉండేది. జస్ట్ మహేష్ పై అప్పట్లా ఒక ప్రీ లుక్ పోస్టర్ వచ్చి ఉన్నా కూడా ప్రపంచ సినిమా డెఫినెట్ గా మరోసారి ఈ సినిమా కోసం మాట్లాడుకుని ఉండేది. ఈ ప్రత్యేకమైన రోజుకి మరింత ప్రత్యేకత యాడ్ అయ్యేది. మరి ఈ స్పెషల్ లుక్ పోస్టర్ ని ఎపుడు మేకర్స్ వదులుతారో చూడాలి. లేదా నేరుగా ట్రైలర్ లేదా సినిమా లోనే చూడాలా అనేది వేచి చూడాల్సిందే.


