పిక్ టాక్ : ‘మహాకాళి’ సెట్స్‌లో అక్షయ్ ఖన్నాతో ప్రశాంత్ వర్మ డిస్కషన్..!

పిక్ టాక్ : ‘మహాకాళి’ సెట్స్‌లో అక్షయ్ ఖన్నాతో ప్రశాంత్ వర్మ డిస్కషన్..!

Published on Mar 28, 2026 2:10 PM IST

Prasanth Varma

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి రాబోతున్న తాజా సూపర్ హీరో చిత్రం ‘మహాకాళి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా ‘అసురగురువు శుక్రాచార్యుడు’గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, నేడు (మార్చి 28) అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సెట్స్‌లోని ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అక్షయ్ ఖన్నా వంటి గొప్ప నటుడితో పనిచేయడం తనకు దక్కిన గౌరవమని ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘హనుమాన్’ వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్‌లో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండటంతో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.

ఈ సినిమాను పూజా అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తుండగా ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుస్తున్నారు. ఇక ఈ సినిమాలో భూమి శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తుండగా, ప్రశాంత్ వర్మ కథను అందించడంతో పాటు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో తన నటనతో యావత్ దేశాన్ని మెప్పించిన అక్షయ్ ఖన్నా ఈ సినిమాతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు