ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ !

ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ !

Published on Mar 30, 2026 9:00 AM IST

Vishwanath

తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా 20 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తికి మధ్య ప్రేమ పుడితే.. ఆ అల్లరి అమ్మాయి, ప్రేమ అంటూ ఆ మధ్య వయస్కుడి చుట్టూ తిరిగే డ్రామాలో కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయిందట.

కాగా రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వీళ్లిద్దరి మధ్య ఎమోషన్ తో పాటు ఫన్ ను కూడా చాలా బాగా చూపించారట. సూర్యకి పోటీగా మమితా బైజు నటించిన విధానం చాలా బాగుందట. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కరెక్ట్ గా సెట్ అయిందట. అన్నట్టు ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు