పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కాల గమనం’. రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని దర్శకనిర్మాత సుధాకర్ బుర్రి తెలిపారు. యువతను ఆకట్టుకునే చక్కటి ప్రేమకథతో పాటు, అటు పెద్దలను ఇటు పిల్లలను ఆలోచింపజేసే మంచి సందేశం ఈ సినిమాలో ఉందన్నారు.
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నామని ఆయన వెల్లడించారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఇకపై వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని సుధాకర్ బుర్రి పేర్కొన్నారు.


