‘పెద్ది’ రిలీజ్ పై చరణ్ క్లారిటీ.. అయినా వదలని కన్ఫ్యూషన్..!

‘పెద్ది’ రిలీజ్ పై చరణ్ క్లారిటీ.. అయినా వదలని కన్ఫ్యూషన్..!

Published on Apr 2, 2026 7:01 AM IST

Peddi

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 26, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తేదీ నుండి తప్పుకుని, కొత్త విడుదల తేదీగా ఏప్రిల్ 30ని ఖరారు చేశారు. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

​అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో, ఈ సినిమా మళ్ళీ జూన్ నెలకు వాయిదా పడనుందనే వార్తలు నెట్టింట జోరుగా ప్రచారమయ్యాయి. మేకర్స్ తమ పోస్టర్ల ద్వారా ఏప్రిల్ 30 తేదీని పదే పదే గుర్తుచేస్తున్నప్పటికీ, ఈ రూమర్స్ వల్ల అభిమానుల్లో కొంత అయోమయం, నిరాశ నెలకొంది. అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్న తరుణంలో ఈ వార్తలు వారిని కలవరపెట్టాయి.

​ఈ పుకార్లకు చెక్ పెడుతూ స్వయంగా రామ్ చరణ్ స్పందించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న పక్కాగా విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. వాయిదా వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు