సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా

సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా

Published on Apr 3, 2026 10:05 PM IST

Raakaasaa

విడుదల తేదీ : ఏప్రిల్ 03, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
దర్శకత్వం : మానస శర్మ
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్
సంగీతం : అనుదీప్ దేవ్
ఛాయాగ్రహణం : ఎదురోలు రాజు
కూర్పు : అన్వర్ అలీ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన లేటెస్ట్ హారర్ కామెడీ సినిమానే ‘రాకాస’. టీజర్, ట్రైలర్ లతో మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్ధాం రండి.

కథ:

కొన్ని వేల సంవత్సరాలు కితం రాకవర అనే కుగ్రామం శాపానికి గురైన కారణంగా తరతరాలుగా ఆ ఊరిలో ఉన్న ఒక కోట లోని బ్రహ్మ రాక్షసుడికి కొన్ని సంకేతాలు రీత్యా, సరం (ఒక ప్రాణాన్ని) బలిగా పంపుతూ వస్తారు. అలా కాలం ఇప్పుడు 2026 వరకు వస్తుంది. ఈ మోడ్రన్ యుగంలో యూఎస్ నుంచి అప్పుడే తన ఊరిలోకి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్) ఎలా ఈ బలి ఉచ్చులో ఇరుక్కున్నాడు? ఎవరి వల్ల ఇటుక్కున్నాడు? ఆ కోటలోకి తను వెళ్లిన తర్వాత ఏమైంది? బలి పంపకపోతే ఆ బ్రహ్మ రాక్షసుడు వల్ల ఊరికి ఏమవుతుంది? అసలా రాక్షసుడు ఎలా వచ్చాడు? అతన్ని ఆపే మార్గం ఏంటి? చివరికి ఈ సమస్య ఎలా పరిష్కారం అయ్యింది? వీరబాబు బయటకి వచ్చాడా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ తో పాటుగా ఇందులో ఫాంటసీ టచ్ లాంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ విషయాల్లో సినిమా అంతగా నిరుత్సాహ పరచదు అని చెప్పవచ్చు.

ముఖ్యంగా సెకండాఫ్ లో కథనం దర్శకురాలు బాగా డిజైన్ చేసుకున్నారు. కొన్ని లాజికల్ అంశాలు పక్కన పెడితే థ్రిల్ మూడ్ లో కూడా మంచి ఫన్ ని జెనరేట్ చేస్తూ సాలిడ్ ఫన్ ని సెకండాఫ్ లో మైంటైన్ చేస్తూ వెళ్లడం ఇందులో ఇంప్రెస్ చేస్తుంది. అలాగే ఒకటీ రెండు ట్విస్ట్ లు కూడా మానస బాగా ప్లాన్ చేసుకున్నారు.

ఇక సంగీత్ శోభన్ మ్యాన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఇందులో అదరగొట్టేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో తనకి, వెన్నెల కిషోర్ నడుమ ఫుల్ ఫన్ మీల్స్ ఆడియెన్స్ కి దొరుకుతాయి. హీరోయిన్ నయన్ సారిక తన రోల్ లో డీసెంట్ గా చేసింది. ఆద్యంతం సినిమాలో కొనసాగుతూ మంచి నటన కనబరిచింది. అలానే బ్రహ్మ రాక్షసుని రోల్ లో కనిపించిన నటుడు కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యి బాగా చేశారు.

అలాగే వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడి పరంగా తన మార్కు కామెడీతో సాలిడ్ ఫన్ ని తను అందించారు. వీరితో పాటుగా గెటప్ శ్రీను కూడా తన రోల్ లో మంచి ఫన్ అండ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మంచి ఔట్ పుట్ ని మేకర్స్ అందించే ప్రయత్నం చేయడం ఇంప్రెస్ చేసే అంశం. వీటితో పాటుగా బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు తమ పాత్రల్లో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇది ఫాంటసీ టచ్ ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం మరీ లాజిక్ కి దూరంగా ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మ రాక్షసుడు లాంటి వాడికి కూడా ఎమోషనల్ యాంగిల్ ట్రై చేయడం ఒకింత కొత్త స్టెప్ అయినప్పటికీ ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం.

అలాగే సంగీత్ రోల్ పై చివరి నిమిషంలో చూపించే ట్విస్ట్ లో నాచురలిటీ అంతగా అనిపించదు. ఇంకా ఫస్టాఫ్ కథనం కూడా సోసో గానే అలా వెళుతుంది. ఇంకా సెకండాఫ్ లో కొన్ని లాజిక్స్ అయితే మర్చిపోవాలి. సంగీత్ అండ్ గ్యాంగ్ అంత సేపు కోటలో ఉండి అన్నీ చేస్తూ ఉంటారు కానీ బ్రహ్మ రాక్షసుడు మాత్రం మొదట అలా పలకరించి మళ్లీ చివరిలోనే వస్తాడు.

ఇలాంటివి కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఇంకా ఫస్టాఫ్ సోసోగా వుంటుంది. ఇటీవల వచ్చిన కొన్ని మిస్టరీ థ్రిల్లర్స్ కూడా ఇక్కడ గుర్తు రాక మానదు.

సాంకేతిక వర్గం:

పైన చెప్పిన విధంగా నిర్మాణ విలువలు మాత్రం ఈ సినిమాలో సాలిడ్ గా ఉన్నాయి. నిహారిక కొణిదెల నుంచి ఇది మరో సాలిడ్ ప్రాజెక్ట్. అనుదీప్ సంగీతం డీసెంట్ గా ఉంది. ఎదురోలు రాజు కెమెరా వర్క్ బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా ఓకే కానీ కొన్ని సీన్స్ లో మాత్రం అక్కడక్కడా ఫ్రేమ్స్ మిస్ మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే దాదాపు మందు, సిగరెట్ లాంటి సీన్స్ లో హెచ్చరిక లైన్స్ కూడా పడలేదు.

ఇక దర్శకురాలు మానస శర్మ విషయానికి వస్తే.. ఆమె డీసెంట్ డెబ్యూ ప్లాన్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్నారు. అయితే ఇందులో కామెడీ ఇంకా హారర్ థ్రిల్ సీన్స్ ని బాగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే కొన్ని సీన్స్ ని కొంచెం లాజిక్స్ మరీ పక్కన పెట్టి డిజైన్ చేసుకున్నారు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ట్రాక్ కొంచెం రొటీన్ గా నడిపించినట్టు అనిపిస్తుంది కానీ సెకండాఫ్ లో మాత్రం ఆమె పోటెన్షియల్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆమె వర్క్ బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఇదో డీసెంట్ ఫన్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన హారర్ డ్రామా అని చెప్పొచ్చు. సంగీత్, వెన్నెల కిషోర్ అలాగే గెటప్ శ్రీనులు మంచి ఫన్ ని అందించారు. అలాగే కొత్త దర్శకురాలు కొన్ని చోట్ల తడబడినప్పటికీ సెకండాఫ్ ని ఆమె సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు. సో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే ఈ చిత్రం మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు