సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?

Published on Apr 7, 2026 8:00 AM IST

Trisha

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె వార్తల్లో నిలుస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నటుడు విజయ్ వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి రావడం, వీరిద్దరూ కలిసి బహిరంగంగా ఒక వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.

​ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో త్రిష నటనకు స్వస్తి చెప్పబోతుందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి బలమైన కారణం ఏమిటంటే, ఆమె కొత్తగా ఏ సినిమాలకు సంతకం చేయకపోవడమే కాకుండా, ప్రస్తుతం చేతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టులను కూడా హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. దీనిపై ఆమె నుండి అధికారిక ప్రకటన రానప్పటికీ, విజయ్ స్థాపించిన TVK పార్టీకి మద్దతుగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఆమె తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఇక సినిమాల పరంగా చూస్తే, సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, మే 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని జూలై 10న విడుదల కానుంది. ఈ రెండు భారీ చిత్రాల తర్వాత త్రిష కెరీర్ ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు