ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?

ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?

Published on Apr 7, 2026 2:03 PM IST

Thimmarajupalli

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాడు. ఆయన నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ సినిమా ద్వారా సాయి తేజ్ మరియు వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతుండగా, వి. మునిరాజు దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.

​పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రూరల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏప్రిల్ 9న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలు సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేయగా, ట్రైలర్‌తో సినిమా రేంజ్‌ను మరింత పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

​ఈ సినిమాలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీకాంత్ రేఖానా సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని పరిస్థితులను, అక్కడి మనుషుల ఎమోషన్స్ ను ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

తాజా వార్తలు