ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ నుంచి రెండో సినిమా ఈ ఏడాదిలోనేనా!

ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ నుంచి రెండో సినిమా ఈ ఏడాదిలోనేనా!

Published on Apr 9, 2026 8:05 PM IST

Fauzi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ సినిమాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న పీరియాడిక్ సినిమా “ఫౌజీ” కూడా ఒకటి. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది కానీ ఆగకుండా కొనసాగుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ పై కూడా అభిమానుల్లో కొంచెం సంకోచం ఉంది కాని ఫైనల్ గా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది లోనే రిలీజ్ కానుంది అని తెలుస్తోంది.

ఆల్రెడీ జనవరిలో రాజా సాబ్ వచ్చింది. కానీ ఆగస్ట్ లో హనుతో సినిమా ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా అప్పటికి ఉండకపోవచ్చు అని కూడా వినిపించింది. ఆ తర్వాత సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా స్లరీ లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ గా ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తారని టాక్. సో డార్లింగ్ హీరో నుంచి ఈ ఏడాదిలోనే రెండో సినిమా కూడా వస్తుందని చెప్పవచ్చు.

తాజా వార్తలు