పవన్ పై స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఉతికారేస్తున్న ఫ్యాన్స్..!

పవన్ పై స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఉతికారేస్తున్న ఫ్యాన్స్..!

Published on Apr 11, 2026 9:00 AM IST

ram charan and pwan kalyan

ప్రముఖ తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరియు ఆయన విడాకులపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్ కావడంతో, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, మరియు జూనియర్ ఎన్టీఆర్‌లపై కూడా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

​అనుదీప్ కామెడీ కేవలం వినోదం కోసం కాకుండా, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని సామాన్య ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై హాస్యం చేయడం అసభ్యకరమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, సదరు కమెడియన్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

​ఈ వివాదంపై జనసేన పార్టీ నాయకులు కూడా స్పందించారు. జనసేన నేత సందీప్ పంచకర్ల ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ కటికలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన నీచమైన కామెడీకి క్షమాపణ చెబుతూ వెంటనే ఒక బహిరంగ వీడియోను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు