న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది పారడైజ్’ పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకోగా, తాజాగా ఈ చిత్ర హీరోయిన్ కాయదు లోహర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆమె ‘సుబ్బు’ అనే పాత్రలో కనిపిస్తుండగా, పోస్టర్‌లోని ఆమె లుక్ చూస్తుంటే హీరోకి భిన్నంగా ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు రాఘవ్ జుయల్, బాబు మోహన్ మరియు సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.


