తీసినవి 9 ఆగిపోయినవి 19.. ఉస్తాద్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

తీసినవి 9 ఆగిపోయినవి 19.. ఉస్తాద్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

Published on Apr 11, 2026 10:00 PM IST

కమర్షియల్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. అయితే హరీష్ శంకర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహ పరిచింది. ఇదిలా ఉండగా తన కెరీర్ సినిమాల విషయంలో చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

పాపం ప్రతాప్ ఈవెంట్ కి హాజరైన తను ఉస్తాద్ వైఫల్యంతో పాటుగా తన కెరీర్లో చేసిన సినిమాలు ఆగిపోయిన సినిమాల కోసం తను మాట్లాడ్డం జరిగింది. తను ఇప్పుడు వరకు చేసిన సినిమాలు తొమ్మిది అయితే ఆగిపోయినవే పంతొమ్మిది అని తను షాకింగ్ రివీల్ చేశారు. చాలా వరకు అంతా సెట్ అయ్యి షూటింగ్ రేపో ఎల్లుండి అనే సందర్భంలో కూడా ఆగిపోయాయి అని హరీష్ వ్యాఖ్యానించడం మరింత షాకింగ్ గా మారింది. దీనితో తన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు