బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని కలయికలో ఓ సినిమా చేస్తున్నారు. ఐతే, దర్శకుడు క్రిష్ తో బాలయ్య మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే, క్రిష్, బాలయ్యకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ కూడా బాలయ్యకు నచ్చినట్టు, త్వరలోనే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎలాగూ, జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉంది. కాబట్టి, ఆ రోజు ఈ మూవీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్.
అన్నట్టు ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే నిర్మించే అవకాశాలు ఉన్నాయట. ఇక బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.


