‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్

‘అతిథి’ రీరిలీజ్.. కొత్త వెర్షన్ తో మణిశర్మ!? క్రేజీ ప్లానింగ్

Published on Apr 13, 2026 12:00 AM IST

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రీరిలీజ్ ల హంగామా అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నుంచే మొదలైంది అని చెప్పాలి. పోకిరి నుంచి మొదలైన విధ్వంసం ఇప్పుడు అతిథి వరకు వచ్చింది. పోకిరి మినహా దాదాపు మహేష్ నుంచి అండర్ పెర్ఫామ్ చేసిన సినిమాలే థియేటర్స్ లో రీరిలీజ్ కి వచ్చి మంచి వసూళ్లు రాబట్టయి. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అతిథి సినిమా అప్పట్లో అంతగా ఆడలేదు కానీ ఇప్పుడు మంచి బజ్ ని సెట్ చేసుకుంది.

ఇదిలావుండగా ఈ సినిమా కోసం క్రేజీ ప్లానింగ్ కూడా సిద్ధం అయ్యింది. సంగీత దర్శకుడు మణిశర్మ అతిథి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మళ్లీ రీ వర్క్ చేస్తున్నారట. పాత సినిమాలో ఉన్నదే కాకుండా కొంతమేర కొత్త సరుకు కూడా తాను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఇలా అప్పటి సినిమాకి ఇలాంటి రూపంలో మళ్లీ ఫ్రెష్ హంగులు అద్దుతూ వస్తున్న సినిమా ఇదే కావచ్చు అని చెప్పాలి. మరి ఈసారి మణిశర్మ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు