మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఆల్రెడీ మార్చ్ నుంచి ఏప్రిల్ కి వాయిదా పడింది. కానీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వాయిదా పడుతుంది అంటూ పలు రూమర్స్ వచ్చాయి.
ఫైనల్ గా దీనిపై అధికారిక క్లారిటీ మేకర్స్ ప్రెస్ నోట్ ద్వారా అందించారు. ఈ సినిమాని ఏప్రిల్ రిలీజ్ నుంచి కూడా వాయిదా వేస్తున్నట్టు ఖరారు చేశారు. ఇంకా ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని పోస్ట్ ప్రొడక్షన్, టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇప్పటివరకు ఎడిటింగ్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీగా కూడా ఉన్నామని తెలిపారు.
సో ఆ సాంగ్ కారణంగా సినిమా ఇప్పుడు వాయిదా పడాల్సి వచ్చింది. అలాగే రిలీజ్ ని జూన్ లో తీసుకొస్తున్నట్టు కూడా తెలిపారు. సో డేట్ ఏంటి అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


