‘ధురంధర్ 1’ హిట్ సాంగ్.. 4 నెలల్లో ఏకంగా 500 మిలియన్స్..

‘ధురంధర్ 1’ హిట్ సాంగ్.. 4 నెలల్లో ఏకంగా 500 మిలియన్స్..

Published on Apr 17, 2026 12:02 AM IST

dhurandhar

గత ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ సినిమానే “ధురంధర్”. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా అన్ని కోణాల్లో కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచిన అంశాల్లో సంగీత దర్శకుడు శశ్వత్ సచ్ దేవ్ వర్క్ కూడా ఒకటి.

తాను ఇచ్చిన ఒరిజినల్ సాంగ్స్ అలాగే పాత పాటల మిక్సింగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సాంగ్స్ లో ఐటెం సాంగ్ షరారత్ కూడా ఒకటి. ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా లపై తీసిన ఈ సాంగ్ కేవలం నాలుగు నెలల్లోనే ఇపుడు ఏకంగా 500 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి బాలీవుడ్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

పార్ట్ 2 లో ఈ రేంజ్ లో హిట్ సాంగ్స్ లేకపోవడం గమనార్హం. మరి ఈ సాంగ్ ఇంకెక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఆల్రెడీ ఈ సాంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్ పేరు కూడా పెద్ది స్పెషల్ సాంగ్ కోసం వినిపించింది. లక్ కలిసొచ్చి ఆ సినిమాలో కూడా ఆమె కనిపిస్తుందో లేదో కూడా చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు