నార్త్ బెల్ట్‌లో సర్‌ప్రైజ్ చేసిన నాని.. ది ప్యారడైజ్ హిందీ కలెక్షన్స్ ఇవే..!

నార్త్ బెల్ట్‌లో సర్‌ప్రైజ్ చేసిన నాని.. ది ప్యారడైజ్ హిందీ కలెక్షన్స్ ఇవే..!

Published on Sep 25, 2026 8:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ హిందీ బెల్ట్‌లో ఊహించని రీతిలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. నార్త్‌లో పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో విడుదల కానప్పటికీ, ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ ద్వారా తొలిరోజే రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

లిమిటెడ్ సంఖ్య థియేటర్లలోనే విడుదలైనప్పటికీ నాని సాధించిన ఈ ఓపెనింగ్స్ ఆయన మాస్ స్టామినాను నిరూపిస్తున్నాయి. ఈ ఓపెనింగ్స్ ఎంత బలమైనవో అర్థం చేసుకోవడానికి ఇతర భారీ చిత్రాలతో పోల్చి చూస్తే విషయం స్పష్టమవుతుంది. జాతీయ మల్టీప్లెక్స్ ఛైన్లలో భారీ స్థాయిలో విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ హిందీలో రూ.2.5 కోట్లు వసూలు చేయగా, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రూ.5.2 కోట్లు సాధించాయి.

ఎలాంటి పెద్ద నేషనల్ మల్టీప్లెక్స్ సపోర్ట్ లేకుండానే నాని సినిమా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషం. ముఖ్యంగా ఒడిశా మరియు ఉత్తరప్రదేశ్ వంటి మార్కెట్లలో ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఒక్క ఒడిశా నుంచే రూ.30 లక్షలకు పైగా నెట్ వసూళ్లు రావడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు