యువ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. గత శుక్రవారం ఏ మాత్రం హడావుడి లేకుండా థియేటర్స్ లో వచ్చింది ఈ చిత్రం. ఎలాగూ బజ్ లేదు, దీనికితోడు సినిమాలో మ్యాటర్ కూడా లేదు. కనీస కథాకథనాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయి. చాలా కాలంగా నిర్మాణంలో జాప్యం చేసుకున్న ఈ చిత్రం, రిలీజ్ అయ్యాక.. ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ఘోరమైన విమర్శలను ఎదుర్కొంది.
మరోవైపు చిత్ర నిర్మాతలు ఇంకా ఈ సినిమా ఓటీటీ హక్కుల ఒప్పందాన్ని ఖరారు చేయలేదు. ఈ ఒప్పందం కుదిరి ఉంటే, ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించగలిగేది. ఇప్పుడు థియేటర్లలో సినిమా వసూళ్లు పెద్దగా లేకపోవడం, మరోవైపు ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెట్టడం, మొత్తానికి ఈ చిత్రం భారీ నష్టాల బాటలోకి వెళ్ళిపోయింది. దీంతో నిర్మాతలు ఆ నష్టాలను పూడ్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఓవరాల్ గా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ బ్యాడ్ పేజ్ లోకి వెళ్ళిపోయాడు.


