నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ ‘ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక అక్కడి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం ఇప్పుడు తన టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జెమిని టీవీలో ఏప్రిల్ 26, 2026న సాయంత్రం 5:30 గంటలకు ఈ చిత్రం ప్రసారం కానుంది.
బుల్లితెర ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమాలో ఉన్న శివతత్వం మరియు ఆధ్యాత్మిక అంశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటాయి. కాబట్టి, బుల్లితెర పై ఈ సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, కబీర్ దుహన్ సింగ్, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించారు. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా, తమన్ సంగీతం సమకూర్చారు.


