రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ (కోలీవుడ్ మూవీ) హీరోయిన్ మరియా నటించబోతుంది.


