‘బైకర్’ బాక్సాఫీస్.. సాలిడ్ నంబర్స్ తో లేటెస్ట్ వసూళ్లు!

‘బైకర్’ బాక్సాఫీస్.. సాలిడ్ నంబర్స్ తో లేటెస్ట్ వసూళ్లు!

Published on Apr 20, 2026 6:01 PM IST

మన టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాళవిక నైర్ హీరోయిన్ గా దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన సాలిడ్ రేసింగ్ చిత్రమే “బైకర్”. చూసే ఆడియెన్స్ కి మంచి థ్రిల్ రైడ్ ని పంచిన ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో మరో డీసెంట్ రన్ అందుకుంది. అయితే ఈ ఏప్రిల్ 3న థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రెండు వారాల రన్ ని పూర్తి చేసుకుంది.

మరి ఈ కొన్ని రోజుల్లో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మొత్తం 43 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది. ఇది శర్వానంద్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ కూడా దాదాపు ఇదే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా జిబ్రాన్ సంగీతం అందించారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు ఈ యునిక్ అటెంప్ట్ ని నిర్మాణ విలువలు పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశారు.

తాజా వార్తలు