వంశీ సినిమా కోసం సల్మాన్ తగ్గాడా?

వంశీ సినిమా కోసం సల్మాన్ తగ్గాడా?

Published on Apr 23, 2026 8:11 AM IST

ప్రస్తుతం అటు హిందీ సహా తెలుగు మార్కెట్ లో మంచి బజ్ ని సెట్ చేసుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ల ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా తాలూకా విజువల్స్ ని మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేశారు. అయితే ఇందులో అమితంగా అట్రాక్ట్ చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది సల్మాన్ ఖాన్ లుక్ అని చెప్పాలి.

సల్మాన్ ఇందులో కొంచెం సన్నబడినట్టు కనిపించడం ఫ్యాన్స్ లో కొంచెం నూతన ఉత్తేజాన్ని అందించింది. సల్మాన్ ఎలాంటి ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కొంచెం తగ్గి కనిపించడం ఆసక్తిగా మారింది. దీనితో వంశీ సినిమాలో చాలా కాలం తర్వాత ఒక ఫ్రెష్ లుక్ లో తాను కనిపిస్తారని వారు భావిస్తున్నారు. మరి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ని వంశీ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు