న్యాచురల్ స్టార్ నాని సాధారణంగా తన సినిమాలను అత్యంత వేగంగా పూర్తి చేసి, పక్కా ప్లానింగ్‌తో విడుదల చేస్తాడు. అయితే, గతేడాది మేలో వచ్చిన ‘హిట్-3’ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఆలస్యం కావడం నాని కెరీర్ వేగాన్ని తగ్గించింది. ఈ సినిమా బడ్జెట్ మరియు రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ సినిమా ఆలస్యం కారణంగా నాని చేతిలో ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్టులు వేరే హీరోల వద్దకు వెళ్లడం గమనార్హం. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్‌లో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అవ్వగా, సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ఇక ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను, నాని డేట్స్ దొరకకపోవడంతో ఇప్పుడు సూర్యతో పట్టాలెక్కిస్తున్నాడు.
మరోవైపు సుజిత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘బ్లడీ రోమియో’ సైతం ది ప్యారడైజ్ ఎఫెక్ట్‌తో వెయిటింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. నాని వేగంగా షూటింగ్ పూర్తి చేసి వస్తే తప్ప సుజిత్ టీమ్ రంగంలోకి దిగలేని పరిస్థితి నెలకొంది. వరుసగా సినిమాలను డెలివరీ చేసే నాని, ఒక్క సినిమా ఆలస్యంతో మూడు క్రేజీ ఆఫర్లను వదులుకోవాల్సి రావడం ఆయన అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.


