యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?

యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?

Published on Apr 24, 2026 7:00 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ఒక కాఫీ కమర్షియల్ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ముగ్ధులవుతున్న నెటిజన్లు, ఈ జంట వెండితెరపై కూడా కనిపిస్తే చూడాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ‘రౌడీ జనార్దన’, ‘రణబలి’ చిత్రాలతో పాటు ఇటీవల శౌర్యువ్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాడు. మరోవైపు శ్రీలీల త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుంది. శ్రీలీల గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆమె డ్యాన్సింగ్ స్కిల్స్ మరియు ఎనర్జీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

విజయ్-శ్రీలీల జోడీని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసి, ఫ్యాన్స్ కోరికను తీర్చే ఆ దర్శకుడు లేదా నిర్మాత ఎవరో వేచి చూడాలి.

తాజా వార్తలు