‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!

‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!

Published on Apr 24, 2026 12:38 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అలాగే ఒక్క పాట మినహా మిగతా సినిమా అంతా పూర్తయినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా కొనసాగుతుండగా సినిమా విడుదల విషయంలో కూడా మేకర్స్ జూన్ అని ఖరారు చేశారు.

కానీ జూన్ లో ఏ డేట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఇప్పటికి ఇంకా పూర్తి కావాల్సి ఉన్న పనుల రీత్యా పెద్ది జూన్ 4న వచ్చే సమస్య లేదట. సో దీనితో పెద్ది జూన్ 25 నుంచి థియేటర్స్ లో సందడి చేస్తుంది అని తెలుస్తుంది. అలానే 24 రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉందట. సో పెద్ది విడుదల అప్పటికే అనుకోవచ్చు. అలానే ఈ డేట్ పై మేకర్స్ అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే ప్రకటించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు