తెలుగు ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తమిళంలో నటిస్తున్న చిత్రం ‘మందాడి’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యిది. ఆర్.ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో సూరి హీరోగా నటిస్తుండగా సుహాస్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రామనాథపురం తీర ప్రాంతంలో కఠినమైన వాతావరణంలో చిత్రీకరించిన ఈ సినిమా, మత్స్యకార నేపథ్యంలోని పడవ పందాల చుట్టూ సాగుతుంది.
దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సముద్ర గమనాన్ని అంచనా వేసే నేర్పరి అయిన ‘మందాడి’ పాత్రలో సూరి మేకోవర్ హైలైట్‌గా నిలవనుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మహిమ నంబియార్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ రానుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే సూరి, సుహాస్ కొత్త లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.


