యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇక ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. వచ్చే వారంలో ఈ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అయింది టీమ్. అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ కోసం ఇప్పటికే ఒక స్పెషల్ సెట్ వేశారు. అన్నట్టు ఈ సాంగ్ లో మరో హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్.
కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.


