మెగాస్టార్ పై ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న బాబీ ?

మెగాస్టార్ పై ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న బాబీ ?

Published on Apr 27, 2026 8:00 AM IST

Bobby-Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌ లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాగా తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు ప్రకాశ్ రాజ్ మరియు మిగిలిన తారాగణం కూడా పాల్గొంటారట. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు