సంగీత సామ్రాజ్ఞి బయోపిక్ లో ‘ఎన్టీఆర్ హీరోయిన్’ ?

సంగీత సామ్రాజ్ఞి బయోపిక్ లో ‘ఎన్టీఆర్ హీరోయిన్’ ?

Published on Apr 27, 2026 2:58 PM IST

సంగీత సామ్రాజ్ఞి అనగానే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గుర్తుకు వస్తారు. పైగా ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఆమె. అలాంటి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథని సినిమాగా తెరకెక్కించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో… ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని రూపొందించడానికి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే, ఈ బయోపిక్ కి సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి.

అయితే, మేకర్స్ ఇంకా నటీనటుల్ని ఫైనల్ చేయలేదు. ముఖ్యంగా ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్రకి ఎవర్ని ఎంపిక చేయాలా ? అని చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఓ దశలో సాయిపల్లవి పేరు బలంగా వినిపించింది. ఐతే, ఉన్నట్టు ఉండి ఇప్పుడు రుక్మిణీ వసంత్‌ పేరు తెరపైకొచ్చింది. రుక్మిణీ వసంత్‌, ఎన్టీఆర్‌తో కలిసి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేస్తోంది. మరి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్ర రుక్మిణికి వరిస్తుందా ? లేదా ? చూడాలి.

తాజా వార్తలు